మహబూబ్నగర్ జిల్లాలో న్యాయవాదుల సుదీర్ఘ పోరాట ఫలితంగానే రక్షణ చట్టం అమల్లోకి వచ్చిందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి తెలిపారు. న్యాయవాదులపై దాడులను అరికట్టేందుకు ఈ చట్టం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమస్యను గుర్తించి చట్టాన్ని అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్లో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు.