MLG: వాజేడు మండలం కడేకల్ గ్రామంలో మంగళవారం సాయంత్రం SI గుర్రం కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో “ARRIVE AND ALIVE” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. యువత మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.