GDWL: అలంపూర్ మండలం బుక్కాపురం ZPHSలో కింది స్థాయి ఉద్యోగాలను స్థానికులతోనే భర్తీ చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మణి కుమార్ డిమాండ్ చేశారు. పాఠశాల చైర్మన్ సాయిలీలకు స్థానికులతో కలిసి వినతిపత్రం అందజేశారు. స్థానికేతరులకు అవకాశం ఇవ్వడం వల్ల గ్రామ యువత ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియామకాల్లో స్థానికతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.