AP: విజయవాడ ఉగ్ర కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో కీలక నిందితురాలు, హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పట్టుబడిన ముగ్గురు యువకులకు ఈమె హ్యాండ్లర్‌గా వ్యవహరిస్తూ, సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆమెను విజయవాడకు తరలించి విచారించే అవకాశం ఉంది.