TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ MLA రోహిత్ రెడ్డి, రితేష్, నమిత్ను పోలీసులు రెండో రోజు విచారించనున్నారు. HYDలోని శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో విచారణ జరగనుంది. ఈ ముగ్గురిని విచారించడం ద్వారా డ్రగ్స్ నెట్వర్క్ మూలాలను, సరఫరాదారుల వివరాలను రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు.