కృష్ణా: గన్నవరంలోని హెచ్సీఎల్ సమీపంలో మంగళవారం రాత్రి ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. కారు గుంతలోకి వెళ్లడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న వారు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాహనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికి ఎటువంటి గాయాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు సమాచారం.