ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రిమండలి భేటీ కానుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఆమోదం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే దిశగా అడుగులు వేయడంతో పాటు పార్లమెంటులో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు వ్యూహరచన చేయనుంది.