TG: ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. వీటిలో ముఖ్యంగా ‘గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(GST) అమైండ్మెంట్ బిల్లు’, ‘వైద్య విధాన్ పరిషత్ బిల్లు’ ఉన్నాయి. ఈ బిల్లులపై చర్చించి సభ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.