GDWL: శ్రీరామనవమి పురస్కరించుకొని ఈనెల 26 నుంచి ఈడిగోనిపల్లిలో నిర్వహించనున్న అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలకు రావాలని శాంతినగర్ సీఐ టాటా బాబును గ్రామస్తులు ఆహ్వానించారు. నిన్న ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల ప్రారంభోత్సవానికి రావాలని సర్పంచ్ మంజుల బడే సాబ్ యాదవ్ కోరగా, సీఐ సానుకూలంగా స్పందించారు.