MBNR: మహమ్మదాబాద్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా భారీ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ జే.రామ్ లాల్ ప్రారంభించిన ఈ శిబిరంలో 540 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 121 మందిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు DHMO డా. కృష్ణ, డా. శ్రీవాణి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించాలని కోరారు.