SRD: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. క్షణికావేశంలో జరిగిన వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం లోక్ అదాలత్ మంచి అవకాశమని తెలిపారు. పరస్పర అవగాహనతో వివాదాలకు ముగింపు పలకాలన్నారు. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.