కృష్ణా: హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించేందుకు పాలకమండలి ట్రస్ట్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది. రూ.50 లక్షల నిధిని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, వడ్డీ ద్వారా అన్నదానం నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే రూ.19 లక్షలు విరాళాలుగా అందాయని ట్రస్ట్ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.