AFGvsNED: నెదర్లాండ్స్ పై 7 వికెట్ల తేడాతో గెల్చిన ఆప్గానిస్తాన్
వన్డే ప్రపంచ కప్ 2023లో సెమీ ఫైనల్ అర్హత కోసం జరిగిన పోటీలో ఆప్గానిస్తాన్ జట్టు నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. అంతేకాదు పాకిస్తాన్ జట్టుకు సెమీస్ ఆశలను మరింత కఠినం చేసింది. ఈ గెలుపుతో ప్రస్తుతం ఆప్గాన్ జట్టు న్యూజిలాండ్ తో సమానంగా పాయింట్ల పట్టికలో ఉండటం విశేషం.
2023 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 34వ మ్యాచ్‌లో ఆప్గానిస్తాన్(Afghanistan) జట్టు నెదర్లాండ్స్(Netherlands)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన స్కాట్ ఎడ్వర్డ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ క్రమంలో 46.3 ఓవర్లలో 179 పరుగులకే డచ్ ఆటగాళ్లు ఆలౌట్ అయ్యారు. ఆప్గాన్ ఆటగాళ్లు అద్భుతమైన బౌలింగ్ చేయడంతో 179కే కుప్పకూలిపోయారు. ముజీబ్ 5, రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్ 3, ఫజల్హక్ ఫారూఖీ 2 వికెట్లు పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ చేశారు.
Afghanistan miss-calculated the run chase in Asia Cup and knocked out of the tournament then came into the World Cup:
– Chase down 283 vs PAK.
– Chase down 242 vs SL.
– Chase down 180 vs NED.
They are writing a history in Afghanistan cricket.
ఇక తర్వాత చేధనకు దిగిన ఆప్గాన్ ఆటగాళ్లలో ప్రధానంగా రహమత్ షా 52, హష్మతుల్లా షాహిదీ 56 రన్స్ చేయగా..180 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్ల నష్టానికి 31 ఓవర్లలోనే పూర్తి చేసి విజయం సాధించారు. దీంతో ఈ జట్టు 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. అంతేకాదు సెమీ ఫైనల్ పోటీకి కూడా దాదాపు అర్హత సాధించినట్లే. మరోవైపు న్యూజిలాండ్ జట్టుతో సమానంగా ఏడు పాయింట్లతో కొనసాగుతుండగా..పాకిస్తాన్ సెమీస్ ఆశలకు ఈ జట్టు కళ్లెం వేసిందని చెప్పవచ్చు.