»Kangana Ranaut Is Clarity About The Competition In The Lok Sabha Elections
Kangana Ranaut: ఎన్నికల్లో పోటీపై కంగనా రనౌత్ క్లారిటీ!
దేశంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నలకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. తాజాగా శ్రీకృష్ణుడి ద్వారకా ఆలయం సందర్శించిన క్రమంలో పేర్కొన్నారు. అయితే ఈ భామ ఏం చెప్పిందో ఇప్పుడు చుద్దాం.
Kangana Ranaut is clarity about the competition in the lok sabha elections
బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో(lok sabha elections) పోటీ చేయడంపై తనదైన శైలిలో సమాధానం చెప్పింది. అయితే పోటీ చేస్తారా లేదా అనేది ఆమె ఈరోజు శ్రీకృష్ణ ద్వారకా ఆలయం సందర్శించిన క్రమంలో తెలిపింది. శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే తాను వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తానని ఆమె వెల్లడించింది. అయితే తనకు పోటీ చేయడం ఇష్టమే అన్నట్లుగా చెప్పకనే చెప్పింది. అంతేకాదు కొన్ని రోజులుగా కంగనా రనౌత్ బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం కూడా అందుకేనని పలువురు అంటున్నారు. దీంతోపాటు ఇటివల మోడీని మెచ్చుకోవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
God is always with those who are honest who think about the good of others and try to do good to them.
एक कहाबत हैं ना? :
“भगवान के घर में देर है, अंधेर नहीं।”
600 ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట సాధ్యమైనందుకు బీజేపీ(BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె గతంలో ప్రశంసించారు. బిజెపి ప్రభుత్వ కృషితో భారతీయులమైన మనం ఈ రోజును చూడగలుగుతున్నామని చెప్పింది. ఈ ఆలయం ఏర్పాటుతో సనాతన్ ధర్మ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఎగురవేయాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. నీటిలో మునిగిపోయిన ద్వారకా నగరం పై నుంచి కూడా కనిపిస్తుంది. నీటి అడుగున వెళ్లి అవశేషాలను చూసేంత సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటున్నానని తెలిపింది. తనకు కృష్ణ నగరం స్వర్గం లాంటిదని ఆమె అన్నారు. ఇక తన సినిమాల విషాయానికి వస్తే తేజస్ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను కంగనా పోషించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు సాధించలేదు. రనౌత్ తాను దర్శకత్వం వహించి, నిర్మిస్తున్న “ఎమర్జెన్సీ”, “తను వెడ్స్ మను పార్ట్ 3″తో సహా తన రాబోయే చిత్రాల గురించి కూడా ప్రస్తావించింది.