TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. రేపు ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసే సభతో CM రేవంత్రెడ్డి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం, అభ్యర్థుల ఎంపికపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తున్నారు. ప్రతి మున్సిపాల్టీలో కాంగ్రెస్ను గెలిపించే బాధ్యతను ముఖ్యనేతలకు అప్పగించనున్నారు.