MDCL: గాజులరామారం పరిధిలోని సీఎంఆర్ పాఠశాల వెనకాల గల్లీలో కరెంటు సరఫరా నిలిపివేయబడిందని దీంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా ఓ విద్యుత్ వినియోగదారుడు TGSPDCL అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన యంత్రాంగం, ఫైర్ యాక్సిడెంట్ కారణంగా ఒక లేన్ కరెంటు నిలిపివేసామని, త్వరలోనే దానిని పునరుద్ధరిస్తామని X ద్వారా పేర్కొన్నారు.