NLG: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు దేవరకొండ MKR ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో మంగళవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొ. రమావత్ రవి మాట్లాడుతూ.. ప్రముఖ ఫార్మా సంస్థలో ‘ప్రొడక్షన్ ట్రైనీ’ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ సహకారంతో నిర్వహించినట్లు పేర్కొన్నారు. దీనిలో 100 మందికి పైగా పాల్గొన్నారు.