KMM: మధిర మండలంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా శిబిరాలను జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బి. పురంధర్ మంగళవారం తనిఖీ చేశారు. దేశినేనిపాలెం, ఆతుకూరు, సిరిపురం గ్రామాల్లో నిర్వహణను పరిశీలించి పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయాలని రైతులకు సూచించారు. టీకాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.