NGKL: జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం కొల్లాపూర్ రూట్లో వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సును తప్పనిసరిగా ఆపాలని మంగళవారం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. కొల్లాపూర్, నాగర్ కర్నూల్ డిపోలకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు విధిగా కలెక్టరేట్ స్టాప్‌లో ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. అలాగే కార్యాలయానికి వచ్చే జనాలను అక్కడ కూడా దించాలన్నారు.