TG: అసెంబ్లీ వేదికగా ఇవాళ అనూహ్య ఘటన జరిగింది. అసెంబ్లీ డైనింగ్ హాల్లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, కాంగ్రెస్ MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, BJP ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకే టేబుల్‌పై కూర్చుని లంచ్ చేశారు. లంచ్ పూర్తయిన తర్వాత కూడా వారు అక్కడే ఉండి దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ప్రస్తుతం ఈ అంశం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.