E.G: జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం మంగళవారం విజయవాడలో జరిగింది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు. సమావేశంలో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ పాల్గొని నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పవన్ దృష్టికి తీసుకువెళ్లారు.