AP: రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇసుక అక్రమ తవ్వకాలపై త్వరితగతిన తీర్పు ఇచ్చేలా హైకోర్టుని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సూచించింది. అక్రమ ఇసుక తవ్వకాలపై హైకోర్టు తీర్పు అనంతరం తాము తుది విచారణ జరుపుతున్నామని తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది.