MNCL: సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముజఫర్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వారన్నారు.