ASF: కాగజ్ నగర్ మండలం జంబూగా గ్రామంలో భూగర్భ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత హాజరయ్యారు. అధికారులు, ఉద్యోగులు కలిసి “నీటి సంరక్షణ ప్రతిజ్ఞ” చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రపంచ నీటి దినోత్సవం ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.