GDWL: ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా గద్వాలలో నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్ నరసింగరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ప్రభుత్వం అందించే ఉచిత పరీక్షలు, పోషకాహార కిట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.