AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై గతంలో నమోదైన రాజద్రోహం కేసుకు సంబంధించి ఐపీఎస్ సునీల్ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి సీఐడీ అదనపు డీజీ ఆదేశాల మేరకే ఆ కేసు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిన్న గుంటూరులో దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరైన ఆయన, ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన విచారణలో పలు ఆసక్తికర విషయాలు తెలిపినట్లు సమాచారం.