AP: దశాబ్ధాలుగా పేదల కోసం RDT అద్భుత సేవలు అందిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం RDTకి కేంద్ర హోంశాఖ అనుమతులు ఇచ్చిన సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘తెలుగు రాష్ట్రాల్లోని వేల గ్రామాల్లో పలు రకాల సేవలందిస్తోంది. నిధుల సేకరణకు RDTని కేంద్రం అనుమతించడంతో మార్గం సుగమమైంది’ అని పేర్కొన్నారు.