ప్రకాశం: ఆర్&బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కనిగిరి నియోజకవర్గానికి రానున్నట్లు ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి పరిశీలించనున్నారు. వెలిగండ్ల మండలంలో రూ.1.85 కోట్ల వ్యయంతో నిర్మించిన గన్నవరం వంతెనతో పాటు కనిగిరి మండలంలో నిర్మించిన నూతన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించనున్నారు