KRNL: ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం చింతకుంట గ్రామంలో సర్పంచ్ తండ్రి ముల్లా రఫీక్ అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆయన భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.