JGL: చిన్నారులకు విద్యా బుద్ధులతోపాటు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడి కేంద్రాల సేవలను పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లోని చేర్పించాలని సర్పంచ్ గోపాల్ అన్నారు. సోమవారం పెగడపల్లి మండలంలోని వెంగలాయిపేట గ్రామంలోని అంగన్వాడి కేంద్రం-2లో చిన్నారులకు అన్నప్రసన్నం చేశారు.