తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు ఓ వెలుగు వెలిగారు. కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలు చేసి కనుమరుగయ్యారు. మరికొందరు సక్సెస్ లేకపోవడం వల్ల ఇతర ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ పరిస్థితి కూడా అలాగే మారింది.
నేచురల్ స్టార్, హీరో నాని, క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబోలో గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ అద్భుతంగా నటించింది. ఆమె రూపం కుర్రాళ్ల మదిలో అలానే నిలిచిపోయింది. అందుకే ఆ సినిమా టైంలో అందరూ ఆమె అందానికి ఫిదా అయ్యారు.
ఆ తర్వాత ఈ హీరోయిన్ సినిమాల్లో కనిపించడం లేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుం వరుస ఫోటోషూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. గ్యాంగ్ లీడర్ తర్వాత ఒకటిరెండు సినిమాల్లో ఈ భామ కనిపించినా ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు.
ప్రస్తుతం ఆమె అవకాశాల కోసం కోలివుడ్ బాట పట్టింది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాలు చేసింది. అందుకే తమిళంలో కూడా పలు సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.