RR: అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా నగర వ్యాప్తంగా అధికారులు 350 భవనాలను తనిఖీ చేయగా, అందులో 320 భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. అయినప్పటికీ సంబంధిత అధికారుల నుంచి తగిన చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.