ELR: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం మొండూరులో సోమవారం రైతన్న మీకోసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వం రూపొందించిన పంచ సూత్రాలను రైతులకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.