ADB: సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని బోథ్ CI గురుస్వామి తెలియజేశారు. పార్టీలు, గ్రూపులు, రాజకీయ వర్గాల మధ్య రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇతరులను కించపరిచేలా, గొడవలకు దారి తీసేలా వ్యక్తుల సంభాషణలు ఉండరాదన్నారు. సామాజిక మాధ్యమాల అడ్మిన్‌పై సైతం కేసు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.