ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడానికి సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది.
వచ్చే వారం రోజుల్లో ఈ విషయంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఏర్పాట్లు పూర్తయితే ఫిబ్రవరిలో 14,523 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ రెడ్డి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు.