అనకాపల్లి మండలం తగరంపూడిలో మాజీ మంత్రి గుడివాడ గుర్నాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మాజీ ఎంపీపీ దాసరి అప్పారావు డిమాండ్ చేశారు. పిరికిపందలు ఇటువంటి చర్యలకు పాల్పడతారని విమర్శించారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచులు ఎస్ తాతాజీ, కె సత్యనారాయణ పాల్గొన్నారు.