MBNR: జిల్లాలో ఇప్పటివరకు రైతు భరోసా అందని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 28, 2026 నాటికి కొత్త పాస్ బుక్ పొంది, అర్హత ఉన్న రైతులు యాసంగి సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ తప్పుల వల్ల డబ్బులు రానివారు వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ ఖాతాతో నేరుగా రైతు వేదికల్లో దరఖాస్తు ఇవ్వాలి.