GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరిగిన 4/4 బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు తెలిపారు. 96.29% ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యుయేషన్, ఫీజు వివరాలకు www.nagarjunauniversity.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.