JGL: హైదరాబాద్ నుంచి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల-2027 ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, రవాణా, భద్రత వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. జగిత్యాల ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.