AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని 2019లోనే ఆదిత్య మిట్టల్‌ను కోరామని మంత్రి లోకేష్ వెల్లడించారు. ‘2024లో అధికారంలోకి రాగానే స్టీల్‌ప్లాంట్ కోసం ప్రయత్నాలు చేశాం. పెట్టుబడులకు గమ్యస్థానం ఏపీ. ప్లాంట్ ఏర్పాటుతో ప్రపంచ పటంలో అనకాపల్లి చేరింది. ఈ ప్లాంట్ ద్వారా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. పెట్టుబడిదారుల్లో సీఎం చంద్రబాబు విశ్వాసం నింపారు’ అన్నారు.