MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని వీరన్నపేట డంపింగ్ యార్డ్‌ను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సోమవారం సందర్శించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పొడి చెత్తపై ప్రతి రెండు రోజులకోసారి నీళ్లు చల్లాలని, తద్వారా అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా యార్డ్ నిర్వహణపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.