ASR: దేశాభివృద్ధికి కీలకమైన జనగణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ‘జనగణన 2027’ ఫీల్డ్ ఎన్యూమరేటర్ల శిక్షణ తరగతులను నిర్వహించారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవాలని శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈనెల 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు.