ELR: బుట్టాయగూడెం మండలం నూతిరామన్న పాలెంలో సోమవారం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ ఛైర్మన్ బోరగం శ్రీనివాస్ పాల్గొని కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేసిన అభివృద్ధి , కృషిని వివరిస్తూ కరపత్రాలను అందించారు. కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం ఒక పండగలా నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు .