GDWL: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా అంగన్వాడీలకు ఇచ్చిన రూ. 18 వేల వేతన హామీని నేటికీ నెరవేర్చలేదని సీఐటీయు జిల్లా నేతలు ఉప్పేర్ నరసింహ, వివి నరసింహ పేర్కొన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా హామీలను నెరవేర్చాలని కోరారు.