ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ ప్రతాప్ కిషోర్ 43 అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదులలో అధికంగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలకు సంబంధించినవి ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిపై విచారణ చేపట్టి, నివేదికలు అందించాలని అధికారులకు సూచించారు.