NRML: పెంబి మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం డిమాండ్ చేస్తూ చేపట్టిన పాదయాత్ర సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరింది. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. యాపాగూడెం నుంచి నిర్మల్ వరకు మూడు రోజుల పాదయాత్రలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో తీవ్రమైన సమస్యలు వెలుగుచూశాయని తెలిపారు.