SKLM: అంగన్వాడీ కేంద్రాలలో వేసవి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మందస సీడీపీవో పి. అరుణ అన్నారు. ఈమేరకు సోమవారం మండల కేంద్రంలో ప్రాజెక్ట్స్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రీ స్కూల్ సమయవేళలు సక్రమంగా నిర్వహించాలన్నారు. మెనూ తూచా తప్పకుండా పాటించాలన్నారు. అనంతరం అంగన్వాడీలకు వంట పాత్రలు అందజేశారు.