ప్రస్తుతం వాడుతున్న 14.2KGల గ్యాస్ సిలిండర్ స్థానంలో 10KGల సిలిండర్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అంతర్జాతీయంగా గ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో.. దేశంలోని ఎక్కువ మందికి సరఫరా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. సిలిండర్ల రీఫిల్లింగ్ పరిమాణం తగ్గించడం వల్ల పంపిణీ సులభమవుతుందని భావిస్తున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.