టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ బయోపిక్ వార్తలు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రేజీ ప్రాజెక్టులో రోహిత్ పాత్రకు టాలీవుడ్ హీరో శర్వానంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీనిపై స్పందించిన శర్వానంద్.. రోహిత్ జీవితం ఎంతో ప్రేరణాత్మకమైందని, తన వద్దకు కథ వస్తే తప్పకుండా నటిస్తానని క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.