TG: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో భారీ స్కాం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 75 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి నోటిఫికేషన్ ఇచ్చారని.. 4.9శాతం అధిక మొత్తానికి అంచనా ఇచ్చారన్నారు. ఇందులో వెయ్యి కోట్ల స్కాం జరిగిందని.. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో అవినీతిపై సిట్ వేయాలన్నారు.